పుట:Sri-Srinivasa-Ayengar.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ర్యము కలిగించుటయే శాసనసభ్యులు ఆదర్శముగా నుంచుకొనవలెను. 7. భూస్వామి, రైతు, యజమాని, కార్మికుడు - వీరిమధ్య విభేదములు తొలగుటకును, వ్యవసాయము, వర్తకము వృద్ధియగుటకును అందరును పాటుపడవలెను.

సైన్యనావికశాఖలు

ఈశాఖలను భారతీయులు నిర్వహింపలేరని ఉదాసీనముగనున్నచో పైవారెవరైన మనదేశముమీదికి దాడివచ్చిన యెడల దేశము ఆధోగతిపాలగును. కావున కొందరైనను బ్రిటిషుసైనికులుగాను, నావికులుగాను శిక్షణపొంది అవసరమైనపుడు దేశసంరక్షణమునకు తోడ్పడవలెను. ప్రభుత్వము యువకులను యుద్ధభటులగావింప ఇష్టపడనియెడల వారిస ప్రోద్బలపరచు కృషి ప్రారంభింపవలెను. బ్రిటిషు ప్రభుత్వము అన్నివిధములగు సంరక్షణము గావించునని కొందరు నమ్ముట పొరపాటు. స్వాతంత్ర్యము లభించినచో వెంటనే దేశసంరక్షణకు శక్తిలేక కలవరముగూడ జనింప వీలున్నదిగావున భారతీయు లందరును దేశసంరక్షణకై అధిక కృషిసాగించుట నేడవసరము. చారిత్రకపరిశీలనలవల్ల భారతీయ