పుట:Sri-Srinivasa-Ayengar.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

143


ముగ అధికారులు అడ్డముతగిలినచో వీరు యెదుర్కొనుటయే గాక సామాన్యప్రజలుగూడ అధికారుల నెదుర్కొనునట్లు చేయవలెను. శాసనసభ్యులు ఈక్రింది అంశములను ముఖ్యముగ గమనింపవలెను: -1. కాంగ్రెసుకోరిన ఆశయములను సఫలము చేయక ప్రభుత్వము కాలహరణముచేసినచో మనలో ప్రముఖులెవరును పదవులను స్వీకరింపరాదు. 2. మసము కోరు స్వరాజ్యమును ఇచ్చుటకు సర్కారు సమ్మతించువరకు బడ్జెటు చర్చలలో శాసనసభ్యులు పాల్గొనక శాసనసభనుండి లేచివెళ్లవలెను. 3. తన ఆధిక్యతను చిరస్థాయి గావించుకొనుటకు ప్రభుత్వము ప్రేరేపించు బిల్లుల నన్నింటిని మూలపడవేసి ఆప్రేరేపణను నెగ్గకయుండునట్లు చేయవలెను. 4. వ్యవసాయ, వర్తక, ఆర్థిక, కార్మిక వ్యవహారములలో దేశము ముందడుగు వేయుటకు శాసనసభలలో తీర్మానములను ప్రతిపాదించుటయేగాక అవి నెగ్గుటకు ప్రయత్నింపవలెను. 5. గ్రామరైతులు, వ్యవసాయదారులు మున్నగు వారి పరిస్థితులు చక్కబడుటకు నిరంతరము పాటుపడవలెను. 6. జమీందారుల ఎస్టేట్ల కాజేయక ఎస్టేటురైతులకు సౌక