పుట:Sri-Srinivasa-Ayengar.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము

1926 వ సంవత్సరమున గౌహతీ కాంగ్రెసుకు అధ్యక్షతవహించినపుడు శ్రీమా౯ శ్రీనివాసఆయ్యంగారుగావించిన ప్రసంగములోని ముఖ్యాంశములను కొన్నిటిని ఈ క్రింద వ్రాయుచున్నాను.

శాసనసభాకార్యక్రమము.

జాతీయవాదులు చిరకాలమునకు ముందే నీర్ణయించుకొన్న ఏర్పాట్ల ప్రకారము దేశాభివృద్దికి అధికారులు ఏ ఆటంకముగాని కల్పించినచో వా రెందుకు నెదుర్కొనవలెను. జాతీయాశయములు పెంపొందబడుటకు శాసనసభలలో అనుకూలముండిననే వానిద్వారా కృషి సాగింపవలెను. ఎందుసను అధికారుల నిరంకుశవర్తనకు ప్రజాప్రతినిధులగు శాసనసభ్యులు లొంగక ధైర్యసాహసములతో దేశ స్వాతంత్ర్యమునకు నిరంతరము ప్రచారముసాగింపవలెను.

కేంద్రఅసెంబ్లీలోను, రాష్ట్రశాసనసభలలోను కాంగ్రెసు జాతీయవాదుల సిద్ధాంతములకు విరుద