పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము


సంధ్యావందనాదులు నిర్వర్తించి జగదుపకారశీలియు, నిష్టురతపోశాలీయునగు సూతమహాముని సందర్శించి సాష్టాంగదండప్రణామంబు లాచరించి తదనుమతిని సనిపు బునఁ గూర్చున్న నన్ను జూచి, విప్పారినమోముతోఁ గరుణా ర్దంబులగు చూడ్కు-లు నిగడించుచు నీసరణి వ్రాక్కుచ్చె---

వేసవి వెట్టనున్ సరకు నెట్టక యెట్టుకొజ్ఞానతృష్ణచే
గాసిలి కాని దేశమని కంకక కొంకక వచ్చితీవు నా
కోసము,సంశయంబులను గొబ్బునఁ దెల్పుము, తీర్చు నాఁడ మా
వ్యాస గురూపదిష్టమగు భాతి నటంచు వచించె సూతుడున్ ,


నావుడు సంస్కృతం బతి సనాతన చే వతభాషయంట, భూ
దేవతలంట తారు తమదే యఁట దాయలుగారటే పగుల్
కావున నద్విజుల్ చదునఁగా సరకంబు లబ్జించుచునంట నే
డీ విధి విప్రులెల్ల వచియింతురు వింతురు ధగ్మపద్దతుల్ ,


చదువఁగరాదో యద్విజులు సంస్కృత భాష వివచనంబుతోఁ!
జదివినవాని నెల్లను ద్విజన్ములకున్ వినిపింపరాదో! యి.
య్యది పొనరించినన్ సరక మందునఁ గూలి నశింప పఁ దప్పదో !
విదితముగాఁగఁ జెప్పుఁడు వివేకులు మీరంటన్న సూతుఁడున్,

94