పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమా శ్వా స ము

కార్యాకార్యవివక్షనుం దెలిసియుం గాలుష్యముం దూఁటఁగా
ధైర్య స్థైర్య ము లేక ధర్మముల నుద్ఘాటింతురే భూసురుల్
మర్యాదన్ దిగద్రావి యీసరణి రామస్వామి! చిత్రంబహో
యా ర్యావర్తము పుణ్యభూమియటె కట్టా! యేమి కానున్న దో!!


భవితవ్యంబును గూరిచి
పొవలి పొవలి పెద్ద ప్రొద్దుఁ బుచ్చఁగ నేలా?
ప్రవచించెద నా యెరిగిన .
ప్రవిమల వేదోక్త ధర్మ పద్ధతి వినుమా !


ఈ సంప్రశ్నము సత్రయాగమున మున్నే వచ్చె నానాడు మా
రూసాడంగను లేక శౌనకుఁడు తా యోజించి యోజించి సం
త్రాసంబుంగొని మోడ్సుకన్ను గవతో ధ్యానింప విచ్చేయుచున్
వ్యాసర్షీం ద్రుఁడు ధర్మనిర్ణయము నొప్పన్ జేసె నిష్పక్షుడై :


వ్యాసశౌసక సంవాదరూపంబయిన యేతరుపాఖ్యానంబు
సర్వప్రాణిమాదంబు, సఘాపనోదంబు, సగుటంచేసి విన్పింతు
నాలింపుము. దాస నీ సంశయంబు దీరు.

వ్యా స శౌన క సం వా ద ము,



నే మిశమందుఁ దొల్లి యతినాధులు పావన సత్రయాగమున్
నేమము తోడఁ జేయఁగ మునిప్రవరుండును నిర్జితేంద్రియ
గ్రాముఁడు నైన శౌనకుని రమ్మని పిల్వఁగఁ జూడఁబోవుచున్
మామక పర్ణశాలకయి సన్ గొనిపోవఁగ వచ్చి యిట్లనెన్,


95