పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వాసము


సూతముని కంఠీరవుండు సముత్కంఠఁ దెల్సుకంఠ స్వరంబుతో-----------


పాత్ర మెరింగి దానము ధృవంబుగఁ జేయుట పొడియంచు స
చ్చాత్రునికోసరంబు నలుచక్కులు చూచితి రేపు మాపులున్
జిత్రముగాఁగ నా తలపు సిద్దీని బొందెను నేఁటీతోడ నే
సూత్రము లేక ధర్మముల నన్ని టిఁ జెప్పెద నాలకింపుమా


శిష్యకోటీ వాంఛా ఫల సిద్ధిఁ జేయు
పెల్ల నాచార్యధర్శమౌ టెరుజుఁగనోక్కొ !
నీ యభీష్టము లెల్ల విన్పించు నెడల
నెరుక గలవారీమాటల నెఱుఁగ జేతు.

అయిన నిప్పుడు ప్రదోష కాలం బాసన్నంబగుచున్నది. సంధ్యావందనాదులు నిర్వర్తించి, నిదురింపుము. "రేపు సావ ధానంబుగా విషయచర్చఁ గావింపవచ్చుననిన, నమస్కారం
బాచరించి సెలవంది, కాల్యకరణీయంబులఁ దీర్చికొని, ఫల భక్షణంబు సలిపి, యథోచితంబుగా వేదికామధ్యంబుననున్న దర్భసం స్తరణంబున, శయించి సుఖనిద్రపోయితి......'

మధుర కేళలసౌరభ మహిత గాంగ
వుండరీకపరాగ సంపూర్ణ మంద
సుప్రభాత వాయువులు వీవోపు లిడుచు
మేలుకొల్పంగ మెల మెల్ల మేలుకోంటి,


93