పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వా న ము

కతిపయ వాసరంబు లిటు కాలముఁబుచ్చుచుఁబోవనోక్కనా
డతిరభ సంబుతోడుతఁ బ్రయాగ ప్రయాగ యటన్న "కేకలున్
శ్రుతిఁబడినంతనే యొడలి చోపుడు మాన్పె బ్రభాత సీత శా
శ్వత జలజాత జాత మృదు సౌరభ శీతల వాత పోతముల్


దిగుదిగుఁడని ‘పోర్టరుల
ధగులం దొర పెట్ట గట్టి వా యచ్చుపడన్
దిగి తత్పరమతి నైత "
న్న గరమ్మునుజూచీ వచ్చినాఁడను నాఁటన్


అంత కూఁత వ్రేటుదూరంబునినుండి యభంగ భంగ శీకరో పేతం బయి, సౌగంధి కాబ్జ మనోజ్ఞ మృదుమధుర పరి మళ సంపాసితంబై , మందంబై, నడయాడు సమీర కుమా రునిచ్వే దైర్థికుల నర్ఘ్యపాద్యాది విధులం బూజింపించుచుఁ, గేళీలోలకలహంసీ 'కలకంఠ స్వరంబున నభ్యాగతుల నాహ్వా నించుచు, నూర్నిమాలికా డోలికల సతిధిద్విజ బాలికల సత్క రించు త్రిపధగాహ్రద పవితోత్రోదకంబుల నవగాహంబుఁజేయ బుద్ధివొడముడు ....

కైలాస శైల శృంగమునుండి గోల గోల
దీగుచుండు నెదీ హిందు దేశమునకు
వంగ దేశామిత భాగ్యసంపద కేది
యాధారభూతమై యలరుచుండు

71