పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురా ణ ము

ఆది కాలమునుండి యార్యుల కెయ్యది
పరమ పవిత్రమై పరగుచుండు
పితృ దేవతల కెల్లఁ బిండసంతతి నేది
కొనిపోయి “యందిచ్చు' నను జగంబు


స్వచ్ఛ వాఃపూర వార పదార యగుచు -
గ్రాలు నే నది యట్టి గంగాభవాని
బోయి దర్శించి హర్షించి మ్రొక్కినాడ
భవము సార్థకపడె నించు భక్తి తోడ.

అంగవ్రాతము సేద దేరెఁ బధి కాయాసంబు పోకారెమే పొకారె,మై
పొంగారెన్ మినిరాడ్డిదృక్ష ద్విగుణీభూతంబుగాఁ దీరె, ము
న్గంగా నా తెలినీటి యందున బుబుక్షాతృష్ణలు దీరె, హా !
గంగా స్నాన మహత్వ మప్పుడుగదా కంపట్టె నా బుద్ధికిన్ ,


అనంతరంబు జలంబులమధ్య నిల్వడి యచ్చోటువాసీ యుదన్ముఖంబుగాఁ గొంతదవ్వుఁ జనుడు....

ముస్క మాత్రాన నేచ్చోటటముక్తి కల్గు
నట్టి ఘోరాఘమర్షణ మైన భవ్య
జాహ్నవీ యమునా నదీ సంగమంబుఁ
గాంచినాఁడను గన్నుల కఱవుదీఱ.


72