పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత పురాణ ము


కవి ప్ర యా ణ ము

కెలన పెంపెక్కిన కృష్ణానదీ తోయ
      ములయందు భక్తి తో మునిగి మునిఁగి
కనక భాషాన్విత కనకదుర్గా దేవి
     ముదముతో దర్శించి మొక్కిమ్రొక్కి
ఆనకట్టను జేరి యతివిస్మయంపడి. -
     యాంగి లేయులఁ గొనియాడి యాడి
సంకీర్ణముగనుండి సంకుల క్వణనముల్
     సలుపు ‘ఎంజిను”లను దలఁచి తలఁచి


సొరిది కొండపై గీములఁ జూచి చూచీ
సృష్టి వైచిత్ర్యమునకు నచ్చెరువుపొంది
రేయి యద్చోటనే వుచ్చి 'రేపకడనే
పయనమై పోయితిని రైలుబండి నెక్కి


వాయుసమాన వేగమునఁ బర్విడిపోయెడి రైలుబండిలోఁ
గాయము కందకుండ నెసకమ్మున నుండి బహిఃప్రదేశమున్
బాయక చూచుచున్న యెడఁబాదపసంహతి భూమినుండి య
త్యాయత వేగమందుచు బయల్పడినట్టుగఁ దోఁచె బుద్ధికిన్,

హేలాదోహల చిత్తవృత్తి జనుచో హేలాపురంబున్ బయిన్
గాళీఘట్టముఁ జూచినాఁడ వరుసన్" గల్యాణ యుక్తంబులై
వాలాయంబు తనర్చు జానపదముల్ ప్రాప్తింపఁ గంగొంటి నీ
లీలన్ బైనముఁ జేసి మామక మనః క్లేశంబు నాళంబుగన్


70