పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాన ము


కోపులు పెట్టువాడ బుధకోటికిఁ గబ్బము మింటనుండియె
క్కూపున నేల నూడిపడ నోపదు, కాని క్రమక్రమంబుగా
నేపగుఁ గాన సన్నయ సృజించెను నాంధ్ర కవిత్వమన్న భా
షాపరిణామవేత్త అనిశమ్ము భృశమ్ముగ సమ్మ రెమ్మెయిన్


పుట్టిన నాఁడే గంటముఁ
బట్టిన నాడే కవిత్వపట్టంబును జే
పట్టిన నాఁడే యెట్టులు
పట్టువడునో సమయబద్ద పద్యము లల్లన్"!

కావున---

తెలుఁగు కబ్బమేగతి నిగ్గుదేరెనో ! క్రమ
క్రమముగ నెట్టి పరిణామ దశఁగ నేనో !
మానసించి ఛాఖాచంక్రమణముగా నీ
చట వచింతు సత్కవిలోక సమ్మతముగ.

మోటుమానిసి నోట మోజుచిందులు దొక్కి
         వనితంపుఁ బాటలఁ బొడ నేర్చి
జోలపాటలు నేర్చి యేలపాటలు నేర్చి
         గొబ్బిళ్ళ పాటల గునుకు నేర్చి
తేవారములు నేర్చి ద్విపద లెన్ని యొ నేర్చి
       త్రిపద చొక్కపు నడతీరు నేర్చి
రగడ లెన్ని యొ నేర్చి రహీ సక్కరలు నేర్చి
        జంగమకథ మేలుచాలు నేర్చి


57