పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


చాలగీతముల్ నేర్చి సీసములు నేర్చి
వెండి బంగారు పడ్డెముల్ వెండీ "నేర్చి
ప్రౌడడపిల్లయే పాతర లాడ నేర్చెఁ
దెలుఁగు కబ్బపుఁ గన్నియ దెలివితోడ.

ఇంతియే కాని సన్నయ వింతగాఁగఁ
బుణికి గంటముఁ జేఁబట్టి కణత లదర
గైతఁ బుట్టించెనను మాట కల్లమాట
బోధ లేని 'కాకవులు చెప్పుదురు గాక.

పడుచుఁ దనముచేఁ దనయంటి పాటమాని
యిరుగువారి పాటల నేర్చి యెగిరిపడఁగఁ
 జిందుసరిగాఁగఁ బడదయ్యె చిట్టచివర
కెరవుసొమ్ముల కాసింప నింతెకాదె.


నేటికీ దాఠి బెఱవారి నీడఁ జేరి
బ్రతుకఁగోరి తంద్రించెడు బ్రదికి చెడ్డ
వారి యగచాట్లు ' కాంచినవారలకట !
కంటఁదడి వెట్ట కుండఁగాఁ గలుగుటెట్లు ?

పూర్వకవి సంప్రదాయమ్ము బుజ్జగించి
కుకవి నింద నోనర్చుట గొప్పయగునె ?
కుకవులుండుటచేతనే సుకవి చంద్ర
కీర్తిచంద్రికల్ దిశలెల్లఁ గెర లియాడు

.


58