పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూ త పు రాణ ము


సవరస వేది తెలుగు నాటఁ బిలుంగుకవిత్వమర్మముల్
గవు సెనఁదీసి కన్ఫఱపఁ గల్గిన సత్కవిరాజు, రాజస
త్కవి యగు వన్నె చోడరసిక ప్రభు జాను తెనుంగు కబ్బపుం
జవు లెఱుఁగంగ సాధ్య మె రసజ్ఞులు ప్రాజ్ఞులు గానివారికిన్ !


ఆయత రాజ్య వైభవము నంత త్యజించుచు సన్యసించి జా
తీయపుఁ దీరుతీయములు తెట్టలుగట్టఁ దేలుంగుకబ్బ
మా ప్యాయన మౌ విధంబుగను బ—న మా చినవేమ రెడ్డినిన్
బాయక ప్రస్తుతించెదను బల్మరు భక్తీ పురస్సరంబుగన్ .



సాంద్రయశోవిశాలుఁడయి సత్కవితా వీభవాభిరాముఁ డై
యింద్రసమానుఁడై గణన 'కెక్కిన కృష్ణుఁడు పెంచినట్టిని
స్తంద్రకవిత్వభూజ ఫల సారముఁ గ్రోలుచు శ్లేషచే హరి
శ్చంద్ర నోలావనీపతుల సత్కథ వ్రాసినవాని నెన్నె దన్.


అంకిలి లేని కవిత్వము
జంకని సాహితిని జూపి సత్క-నికోటిన్
సుంకం బడుగంగల మా
వేంకటకవిరాజు శక్తీ వినుతి యెనర్తన్,


ఆదికవిచంద్రుఁ డనుచు, నన్నయ్యభట్టే
యాంధ్ర కవితా ప్రపంచస్వయంభు వనుచు
మించి నిర్దారణముఁ జేయ నెంచి కాదే
నిజ మెరిగి కప్పిపుచ్చ యత్నింతు రివుడు.


56