పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణరచనావశ్యకతయేమి?

గా నొండుకథ నిట క్లుప్తీకరించి వ్రాసెదము- "తొల్లి తార కుండను దనుజుండు నిజభుజోర్జిత దుర్దమ విక్రమచాతురీవిభ వంబున సర్వలోకములు నిర్జించి యింద్రాదులను నింటి దానులుగాఁ జేసికొని లోకము లేలుచుండెనట. ఈ దాడికి నోర్వ లేక యింద్రాదులు కుట్రలుపన్ని విష్ణువుతో యోజింపఁగాఁ బురాణదంపతులగు నుమామహేశ్వరులకు జన్మించిన పుత్రు డొక్కఁడే తారకాసురుని జయింప నేర్చునని నొప్పి చెప్పెను. అందుపై దేవతలు' గుసగుసలువోయి యెట్టులో మన్మధునిఁ బ్రేరేఁచి పురాణదంపతులకుఁ గామోద్రేకముఁ గల్పించి, క్రీడోన్ముఖులం జేసిరి. ఈ క్రీడకుఁ. దుద మొదలు లేక పోయేను. విరోధునియింట నూడిగముఁ జేయుచున్న యిం ద్రాదు లాలస్యమునకుఁ దాళ లేక యగ్ని దేవునిఁ బురాణ దంపతు లేమిచేయుచున్నారో చూచిరమ్మని పంపిరి. అగ్ని భట్టారకుండును దొంగనడలచేఁ బోయి తొంగిచూడ నగ్నమై యున్న పార్వతీనతి ద్వీగ్నయై మజుగుసకు సరుగ వాచామ గోచనుఁడైన మ హేశ్వరుసకు రేతఃపతనమయ్యెసఁట. ఎచ్చట? ఎదురుగ నిలిచియున్న యగ్ని భట్టారకుని నోటిలో, అప్పు డగ్ని దేవుఁడావఁ ద్రావినట్లయి, యేమి చేయుటకుఁ దోఁచక పరువుపరువు గంగానదికీఁబోయి ముఖప్రక్షాళనము గావించు కొన నా రేతస్సు శరవణమునందుఁ బడెను.. పడిన వెంటనే యందుండి యారు మొగములతోడను, బండ్రెండు చేతుల తోడను గుమార స్వామి యవతరించి దేవ సేనానియై తారకుని


48