సూతపురాణరచనావశ్యకతయేమి ?
కాలములో సమకూడని మహోపకారము విదేశీ ప్రభువుల కాలములోఁ దటస్థించినది.
సూతపురాణరచనావశ్యకత యేమి ?
పాకృత జనంబునకు వేదార్థము సుల భైక వేద్యము కాదని యెరింగి వైదికులును, నిష్కాములును, లోక సంసర్గ రహితులును, నిసర్గభూత దయాశీలురును నయిన ఋషి చంద్రులు నీర్వ్యాజ కరుణావి శేషంబున “స్త్రీశూద్ర ద్విజ బంధువు”లను ముక్తిమార్గముఁ జూపి తరింపఁ జేయుటకునై వేదార్ధము నుటంకించి పురాణములు వ్రాసిరని యూర్వో క్తి. ఈ యార్యో క్తియందు విశ్వాసముంచి మూఢలోకంబు వురా ణము లార్ష్యేయములనియుం దత్కారణమునఁ బూజ్యము లనియు దదంతర్గత ధర్మములు, నీతులు, కథలు శిరోధార్యము లనియు విశ్వసించు చున్నది. ఈ విశ్వాసమువలనఁ 'గలిగిన ప్రతిఫల మాత్మద్రోహముగాఁ బరిణమించుటఁ జేసి, వురా ణము లెంతవఱకుఁ బ్రతికూలములో, ఎంతవఱకు నీతి బాహ్య ములో, యేంతవఱకుఁ బక్షపాతభూయిష్టములో మోడ్పు గన్ను తోనున్న విద్యల్లోకమునకుఁ జూపించు తలంపుతో సూతపురాణము రచింపఁబడినది. తత్కారణమున సూతపురా ణము కారణజన్మ భగవదవతారమని యెంచఁబడువారిం గూర్చియైనను, హేయభాజనమగు వర్ణనలు చేయుటకుఁ బురా ణములయందుఁ గవిలేఖిని జంక లేదు. ఇందులకు నిదర్శనము
47