పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతవురాణరచనావశ్యకత యేమీ ?

వధిం చెనఁట,” ఇయ్యది 'శ్రీశూద్రద్విజబంధువు లకుఁ జెప్పఁబడిన కథ. స్త్రీల యుపయోగార్థమై వ్రాయఁదగిన కథ యేనా? ఇట్టికథను, ఈ జుగుప్సాకరమగు వర్ణనాంశమును విన్న వారికీ మనశ్శాంచల్యము సంభవిపదా? కొందరు మహ నీయులు బయలు దేరి యిట్టికథలకు సంతరార్థము బోధింప సమ కట్టుదురు, నిజముగ వంద్య మైన యర్థము, నీతిదాయకమయిన విష యమొక్కటియుస్న , నిట్టిభాషలో నిట్టవర్ల నలతో నీకథ నేల చెప్పవలయును? మఱచితిమి. ఆ జ్ఞేయమగు గ్రంథమును నిట్లు చర్చింపఁదగదు. వాల్మీకి యంతవాడో, వ్యాసుని యంత వాఁడో వ్రాసిన గ్రంథములయందుఁద్యాజ్యములగు సంశము లుండునా? తెలుగు దేశములోఁ బ్రచారమునందున్న చిత్ర కథలు, రసు క్తులు తెనాలి రామలింగనికి నంటఁ గట్టినట్టు, పూ ర్వమున్న గ్రంథములన్నియు వ్యాసుని మెడకుఁ దగిలించుట యాచార మైనది. పాఠకమహాశయా ! వివేచనముతో గ్రంథ పరిశీలనము గోవించుకొనుము.


ఇఁకఁ బరమకరుణాస్వభావుండయిన సూతర్షి చిర కాల జీవియగుటచే ద్వాపరయుగమునుండీ పరమ తపోనిష్టాగరిష్టుం డయి గంగాతీరముననుండి నేఁడీ భారతలోకంబుస జరుగుచున్న వంచసను, మోసమును సంపూర్ణముగా గ్రహించి, జూలిపడి లోకమును మనుమార్గమునందు నడిపించుటకై తలపోనీ, శిష్య పరమాణులమైన మాయందలి దయతో రేకముచే సత్యమును


49