పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యగ ము లు


ధరాభిమానము, కులాభిమానము, ఆత్మాభిమానముగామారినది. ఇవన్నియు నుత్కృష్టస్థానమునుండి పతిత మైనజాతీయొక్క బహిర్లక్షణములు, వర్తమాన భారతలోకంబు చచ్చీ చావని యవస్థలో నున్న ది. అవతారపురుషులును, కారణజన్ములు ససఁదగిన మహాత్ముల యుద్బోధచే జీవలక్షణములు కొన్ని యస్ఫుటముగాఁ గన్పించుచున్న వి. సుగాత్ర ప్రాయముగానున్న పై వాక్యములను సోదాహరణముగా సందర్భానుసారంబుగా నిట విపులీకరించుచున్నాము.


యు గ ము లు


కాలచక్రంబునకుఁ గృత త్రేతా ద్వాపర కలియుగంబు లను నాలుగాకు లుండుననియుఁ, బగటిని వెన్నంటి రాత్రిరెట్లు వచ్చుచుండునో, యట్లు మర్యాద దప్పకుండ జనఁగా గృతము ముగిసిన వెంటనే త్రేతయుఁ, ద్రేత ముగిసిన ద్వాప రము, ద్వాపరము ముగిసినఁ గలియుగము, వచ్చుసని పురా ణములు? చెప్పుచున్నవి. ఈ పరివర్తనము కేవలము సై జవిరు ద్దముగఁ గన్పట్టుచున్నది. కాలమునకు స్వభావసిద్దముగా మంచి చెడుగులు కలవనుట సైతండికులాడుమాట. "మంచి చెడుగులను గల్పించునది లోకము. లోక మేనాడు కాసు వీసమయిన వీసరపోకుండ, మర్యాద మారకుండ, నీతిబద్ధ మై, ధర్మపక్షపాతమున సంచరించునో, నాఁడు కృతయుగమవతరించును. నాల్గవపాలు ధర్మ పీడ తటస్థించిన యెడలఁ ద్రేత



25