పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలి ప లు కు లు


మొక కులమున జీర్ణించినప్పుడు విద్యా వ్యాసంగము శీర్ణించుట స్వభావసిద్ద మే కదా? ఏతన్మూలమున గురుసాన్నిధ్యముననుస్న పండితమ్మన్యులక న్న దదితరు లీ యతిశయ శేముషీధురీణు లగుట సంభవించుచుండెను. నేఁడు చూడరాదా? పుష్పగిరి శంకర పీఠము నధివసించిన వర్తమాన శంకరస్వామి ఆదిశంక రునితో నుపమింపఁబడుటకు నర్హుడా? శ క్తి సామర్థ్యములు సన్న గిల్లినకొలంది,గురుపీఠంబునకుఁ బండిత ప్రకాఁడులదేసననీర్ష్యా సూయలు వర్ధిల్లఁజొచ్చెను. ఇతరుల విద్యాప్రకర్ష "తాత్కాలిచారపరంపరకుఁ గన్ను గుట్ట గుండెదిగు"లేర్పడినది. పదం పడి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యగ్రస్తమైనది. ఆచార్యత్వమునకు రాచబాట లుత్పన్నమగుటచే, దొంగ దారు లుత్పన్నమైనవి. విధ్యాపక్షపాతము నశించినది. ధర్మ పశుపాతము శిథిల మైనది. నత్యనిరతి 'కృశించినది. యథా గురు స్తథాశీష్య' యనునట్లు ప్రజాసామాన్య ముందు ధర్మ చ్యుతి యేర్పడినది. చిత్తశుద్ధి లుప్తమైనది. చిత్త సంస్కారము లేని శుష్కా-చార మే మోక్ష సాధన మను గాథలు తలయెత్త సాఁగినవి. ఈ యభిపాయ మే క్రమక్రమముగ నలుదిక్కులు నలముతోనుటం జేసి, నేఁటి భారతవర్షంబున దాంభికులకు, జల్ములను మానమర్యాద లేర్పడినవి. దాంభికులు ధర్నాది కారు లగుటచే ధర్మము వ్యత్య స్తమైనది. ధర్మాధర్మవివక్ష జ్ఞానము గల్గియు మోమేటగలవారగుటచే ధర్మాధికారులు కూడ నిటుసటు ఉయ్యాలో జంపాలో" యనుచున్నారు.



24