పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యు గ ము లు


యే తెంచును. ఆ రసాలు ధర్మము శీర్ఘమయినచో ద్వాపరము పొడచూపును. మూడుపాళ్లు ధర్మనాశనము కల్గినఁ గలి యుగము తలచూపుననీ పౌరాణికులవాదము. ఈ యసంత కాలమున యుగపరివర్తనము పురాణోక్త నియనుబద్ధముగాక ప్రవర్తిల్లు విషయము మన మెుంగుదుము. ప్రజా బాహుళ్యము యొక్క ధర్మప్రవర్తనముచే యుగములు కల్గుచుండు ననుట నిర్వివాదము. లేని చోఁ బ్రపంచమునం దెల్లెడ నొక్క కాలమునం దొక్కయుగమె ప్రవర్తిల్ల వలయును, ఇది యను భవ విరుద్ధమమగుటయే కాక, సనాతన మతసిద్ధాంతమున కే ప్రతికూలము. ఏక కాలమునందలి వివిధ దేశ చరిత్రలఁ బరిశీ లించి, పంచిన యడల మావాక్యములు సుబోధములు 'కాకమానవు.


చీనా దేశ యాత్రికుఁడయిన అవును త్సాంగ్" మిగుల పురాతన కాలమున హిందూ దేశముయొక్క యాయా ప్రాంత ముల సంచరించుచుఁ దత్కాలపు హిందువులనుగూర్చీ వ్రాసిన వ్రాతలను జదివినచో శరీరము పులకరించక మానునా? పిమ్మట నా కాలమునాఁటి యస్య దేశముల మీఁదికి దృష్టి సారింపుఁడు. ఇంగ్లాండు నిజముగా మృగదశనుండి వెలువడు చున్నది. పర్వత కందరమందిరములు, కోటరకుటీర ములు, చర్మాంబరములు, అపక్వమాంసగ్రసనము, నిరంతర దేశబ్రమణము కల్గి మృగద శాలీలావిలోలమై యున్నది. ఆకాలము నాఁటి అమెరికా, ఆఫ్రికా దేశములను బరికించిన చో


26