పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముడు


బడెను. మరల నెప్పటి పోటయే. అనుమాసము వదలింపుమని శ్రీ రాముఁడు సీతను గోరెను. సీత మనస్సు చివుక్కుమని యెను. నిరంతరము సంశయాత్ముడగు భర్తతోఁ గావురముఁ జేయ రోసి, యేనపడి, సభాముఖంబున బెక్కు వేలమంది చూచుచుండ భూనివరంబునఁ బ్రవేశించి యాత్మ త్మహత్యగావించుకొనియెను. ఈ కథ శ్రీరామచంద్రుని యేకపత్నీ వ్రత మెట్టిన్ర నిత్యము చాటుచుండును. సీతమ్మ మూల హేతువు , చెఱల కెవ్వరు?


లోకకంటకుండయిన రావణుని సంహరించుటకు భగ వంతుఁ డీరూపమున భూమి పై సవతార మెత్తనంట ! నిజమే. ఎత్తునుగాక! ఆర్యలోకంబునకు రావణుండు కంటకుండు. రక్షో (దావిడ) లోకమునకు రాముండు కంటకుండు. వీటిలో సెవ్వరు ధర్మపరులని యెవ్వరు నిర్ణయింపఁ గలరు ! ఔరంగ జేబు హిందూలోకంబునకుఁ గంటకుండు. ఛత్రపతి శివాజీ మహమ్మదీయలోకంబునకుఁ గంటకుండు. రావణుఁడు సర్వ లోకకంటకుం డనుట వితండవాదము. విట్లు లొప్పుకొనరు, రావణుని ధ్వజపటంబు క్రింద ద్రావిడోకంబు కడుపులో చల్ల కదలకుండ కాలక్షేపముఁ జేసెను. లంకా రాజ్యము సమ సైశ్వ త్యంబులతోడను దులదూఁగుచుండెను. ఆర్యు లెఱుంగని రకాశవిమాపముల నిర్మించు. నైపుణ్యము ద్రావిడశిల్పు లెణుంగుదురు. ఒక్క యాకాశవిమానము లేకాదు; ద్రావిడ \

26