పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకపత్నీ వ్రతుఁడేనా ?



చమందు బహుభార్యాత్వము నాఁడు పండితనం భావితము కాక పోయెను. బహుభార్యాత్వము ముందటితరముతోడనే ముగిసిపోయెను. లక్ష్మణ భరత శత్రుఘ్ను లుకూడ నేకపత్నీ ప్రతులే. ఔరా ! రాముఁడు భగవదవతారము. సీతామహా దేవి యాయన యర్థాంగి సీతతో సమానమగు దాంపత్య సౌఖ్య మనుభవించిన వారెవ్వరున్నార లీ ప్రపంచమందు పెండ్లియయినదిగోలె శ్రీ రాముఁడు ప్రతినిమిషమును నా మె యీలు వును శంకించుచు నేయుండెను. రామునకు మనశ్శాంతి యెన్నఁడున్నట్టు తోచదు. పైకిమాత్రము శంకించుచున్నట్టు కన్పట్టక 'యే చాకలిమీఁదనో, యే పొమరలోకముమీదనో నెపము వైచి, నిందమోపి, యది నిజము కాదని ఋజువు చేయు భారము సీత నెత్తి పైఁ బెట్టుచుండును. ఔరా ! యిదియా ఏకపత్నీ ప్రతుని లక్షణము? సీత లంకలో సగ్ని పరీకు యొనర్చి, తన సాతివత్యమునుగూర్చి తనకును, నెల్ల లోకమునకు శంకా నివృత్తిఁ జేసెను. ఇంతటితోఁ బరీక్ష ముగియ లేదు. శంక నివృత్తి కాలేదు. శ్రీరాముఁడు నిండుచూలాలిని మోసగించి, కారడవిలో వదలి పెట్టించెను. ఈ కార్యముఁ బచ్చి నెత్తుకు శ్రావు కటిక వాడయినఁ జేయ సాహసించునా ! ఎట్టులో యడవిలోనున్న మున్యాశ్రమమునుం... సీతాదేవి, యయో ధ్యకుఁ గొనిరాఁబడెను. శ్రీరామచంద్రు సమ్ముఖంబున నుంప

25