పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రణనీతి

శ్రీరాముఁడు వాలింజూచి బెగ్గిలి ప్రాణంబు లెగిరి పోవ నొంటి ప్రాణంబుతోఁ, చెట్టుమాటున డాఁగి, యొక్క యమోమశరంబుఁ దొడిగి, యొంటివానిని, దమ్మునితో మై మఱచి యెక్కటి కయ్యంబుఁ జేయువానిని, జంకుగొంకు మాలి చంపెను. కట్టకడపటి యుద్ధంబున రావణునితో (బోరి పోరి, డస్సి ప్రస్సీ, యధర్మంబని " యెఱింగియు , దన్నాభీ కమలంబుస సమృతంబున్నదని సాకు గల్పించి, శ్రీరాముఁడు రావణుని బొడ్డు పై గొట్టి మడియించెను. సత్యైక నిరతుండును నిష్కపటియు నగు + బలిచక్రవర్తి తాఁకోర్వజాలక వరం బను మిషచే నొక్క 'పొట్టిశింగణా చే నెత్తి పై గాలు పెట్టించి పాతాళంబునకు దిగఁదొక్కించిరి. భీమార్జునకృష్ణు లేక మై, రాత్రిపూట, శివపూజానిమగ్నుండయిన జరాసంధుని నొంటివానిని, నిరాయుధుని మడియించిరి. ఇట్టి నెన్ని యో [1]

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''



22

  1. * బలిచక్రవర్తి మలయాలదేశమునకుఁ బ్రభువు. నేఁడుకూడ మలయా ళీలు ఓనమ్ పండుగ యని యొక్క పెద్దపండుగఁ జేతురు. అది బలి చక్రవర్తి దేశమును ముభిక్షముగా బరి పాలనఁ జేసినందులకుఁ గృతజ్ఞతా సూచకమని యందురు. పండుగ దినములలో దేశమంతయు నిత్యకల్యాణము పచ్చతోరణముగా నుండును, పండుగ దినములలో బలిచక్రవర్తి యేఁడాదికి నొక్క తూరి తనదేశమున జూచిపోవుటకు వచ్చునని మలయాళీల మూఢ విశ్వాసము.