పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'

ఆ ర్య మంత్రాగము


డును నైన బలిచక్రవర్తిని, జూరుండును భ్రాతృహంతకుఁడు సగు దేవేందునికై మాయోపాయంబునఁ దెగటార్చిరి. ఆర్యులు కర్ణముఁ దీర్చికొనుట కెట్టి హేయభోజనములగు ధర్మపీడలు చేయఁ గొంకరో యీ క్రింది కథంజదివిన బోధ పడకపోదు. వైరిజన దుర్భేదమగు కోటను గట్టికొని త్రిపురా సురులు నిశ్చింతగా రాజ్యమ చేయుచుండిరి. ఆర్యులు వారల నొంచ నేరక, వారి వైభవము కన్ను గుట్ట శాంతి లేకయుండిరి. త్రిపురాసురపత్నులు మహాప్రతివతలు; ధర్మపరాయణలు, ఎన్ని విధములఁ బ్రయత్నించినను, నార్యుల వేగుపనివల్ల లాభము చేకూరదయ్యే, దాస నార్యులు కలుషి తహృదయులై బుద్ధుని (శాక్యమునికాదు) - త్రిపురాసురుల భార్యలం బేరి, వారిని ధర్మచ్యుతలం జేసి, వారివల్ల రహస్యములను దెలిసికొని రమ్మని బ్రేఁరేచి యంపిరి. బుద్ధుఁ డెన్ని దినములో 'వేచి "వేచి, యెట్టులో వారల నే శాంతముగఁ గలిసికొని, పాషండ మతము బోధించి, 'వేదబాహ్య లనుజేసి, లోఁబఱ చకొని, గుట్టుఁ బేడు చేసి మగిడివచ్చెను. అటు పై నార్యులు దండెత్తి తిపురంబు లను ముట్ట నించి కీలెజింగినవారగుటచే సళమంబున తివుగా సురుల నొడిచిపుచ్చి, వారి పట్టణంబులు ధ్వంసముఁ జేసి. జిల్లేడువి త్తసముల పెదఁజల్లిరి. భగవంతుఁ డర్యుల యేంటి మొత్తుకోళ్ళంగీకరించి బుద్ధుఁడై యీ యకార్య మును జేసెనట. ఈయన యెట్టి భగవంతుఁడో తెలియ రాదు.

21