పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


అసురులు ప్రాణగొడ్డమగు నాకటి చిచ్చునకోర్వ లేక నీ
రనపడి యెట్ట కేని పర రాష్ట్ర పరంపరఁజూచి ప్రోచికో
ననువులఁ బశ్చిమాభిముఖులై చని కాసనసీమలందుదు
ర్వ్యసనములందుఁ జిక్కక ప్రవాసముఁ జేసిరి సంతసంబులో,



కాయకష్టంబులకునోర్చి గహసభూమి |
శరభ సింహ శార్దూలాది జంతువితతిఁ
జంపి వాసయోగ్యంబుగా నవదరించి
కాపురంబుండిర చట సౌఖ్యంబుతోడ.


కొంప గోడిగల గడించి కుములుడించి
పొట్టకూడు మరియుఁ గట్టు బట్టగల్గి
పిల్ల జెల్ల లతోడ వర్ధిల్లి నార
లసురసింహులందందుఁ గాఱడవులందు.


అసురులిదె నేటి పారశీ కార్యులైరి
యసుర సంతతి పారశీ లైరి నిజము
పొరశీకమయ్యే నసుర వాసభూమి |
తికమకలు లేక చర్చింపఁ దెలియఁగలరు..



అసురవి తాసముంగలిసి యచ్చటఁ గావురముండఁబోక యా
దెసలను వీడుచున్ యవలి దేశముఁబోయి సదాయయోనిజుల్
పసగల దేశముల్ గమిచి పట్టి సుఖోన్న తిఁ బొంది "నేఁటికిన్
వసతుల "నేర్పరించికొని వాసముఁ జేతురు పేరు పెంపుమై,


87