పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


స్మృతులనుచు మఱియుఁ బురాణ వితతి యనుచు
ముక్తి నీఁజాలు గ్రంథ సమూహ మనుచుఁ
గల్ల కపటం బెఱుంగని నల్లవారు
నెమ్మనమ్ముల గట్టిగా నమ్మి చెడిరి.



వినుము కుమార ! నీకు వినిపించెద సర్వము భావిసంగతుల్
కనుకనిచేత నింకఁ జీరకాలము ద్రావిడభూమి యీగతిన్
బనపదు పూర్వకాల పరిభావము నీఁగుసుమా ! ప్రబోధముం
గని యెస రేఁగి ద్రావిడులుఁగాంచెద రర్హ పదంబుఁ జెప్పితిన్ ,


నేతువు దోట్టి వింధ్యగిరి సీమల దాఁక వసించు ద్రావిడ
వ్రాతము కన్ను విప్పి యొక పారి కనుంగోని యాత్మ దుస్థితిన్?
దీతువుపిట్టవోలె నిగ దించెడి జూల్ముల త్రుళ్ళు వాపి రుం
ద్రాతత పూర్వవైభవ సమన్వితులై యురళింతు రెంతయున్


జూకఁ బదిబదా రేండ్లుగ డాకమున్న
సూత్న భావోదయముగల్లి నూతన ప్ర
బోధమునుగల్గి ద్రావిడుల్ పూర్ణ గౌర
వంబుఁ బొందఁగలరు నిక్కు-వంబుగాఁగ.

అమరుల వలన

అని వచియించి, సూతమహర్షి నాచే సర్జింపబడి యపలి కథాప్రపంచమును వినిపింప సమారంభించి -


86