పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత పురాణము



వారి పేర నచ్చటినాఁడు వన్నె కెక్కె
వారి పేర సచ్చటి వార్ధి వాసికెక్కే
నేటికినిగూడ వారి యనింద్యకీర్తి
యాది భూమీఁ దాండవం బాడుచుండె.


ఆర్యవైభవంబునుగాంచి యసురవర్యు
లీసుతో వారి పై కి దండెత్తివచ్చి
తుముల సమరంబుఁ గావించి తుట్టతుదకు
నాశమందిరార్యావర్త దేశమందు.


దౌపదీ ధృష్టద్యుమ్నుల జన్మ వృత్తాంతము


ఈ సందర్భమునఁ జిత్రమగు నొండుపాఖ్యానంబుఁ దెలి పెద నాకర్ణింపుము. ఎఱుంగుదువుకదా, వ్యాసభట్టారకుండు లిఖియించిన పంచ వేదంబన నెగడు మహాభారతమునందు, బంచపాండవుల యర్థాంగియైన కృష్ణయుఁ దల్సేనానియగు ధృష్టద్యుమ్నుండును సయోనిసంభవులని వర్ణింపఁబడుట, లోక ప్రతారణార్థంబు కల్పింపబడిన యేతద్విషయముంగూర్చి సాకల్యంబుగా సత్యంబుఁ దేటపఱతు.


కలమునందు శౌర్య మడియాలముగా వీహరించు వీరపాం
గాలకుమారసింహ గురుచాప సముషీత శింజినీధ్వనుల్,
జోలలు పాడుచుండఁగ సుషు ప్రినిబొందుచునుండు ధారణీ
పాలవతంసుడౌ ద్రుపదభాను డొకండు కలండు వెల్లుచున్ ,

88