పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము



జోహారులు చేయుచున్న ద్రావిడ మాత్రులకు, నై హిక వాంఛా
సంతృప్తిఁ జేయంబాలు విడిముడి యిచ్చినంగాని, కులగౌర
వంబు నొసంగినఁగాని, యార్యసంసర్గంబు నైహికాముష్మిక
ఫలదాయకంబని, విశ్వాసంబుఁ గల్పించినంగాని, వీరార్య
విజృంభణఁ బునకుఁ గొఱముట్టులు కా నేరరు, కావునఁ దక్షణమ
సమాధాస పఱచుట సమాచీనంబని, నిర్ధారించి.....



కులము లేనట్టి వారికిఁ గులమునిచ్చి
పేరు లేనట్టివారికిఁ బేరునిచ్చి
సొమ్ము లేనట్టివారికి సొమ్ములిచ్చి
పనిని సాగించెను గుల నాపకులఁ జేసి,


ద్రావిడనంఘము" వదలి తక్కుచు వచ్చినవారి సెల్లరన్
బ్రోవుగఁజేసి మాట పయిపూత మెఱుంగులు దోఁప నార్య థ
ర్మావళి నాచరించు నెడ నైహిక సౌఖ్యములబ్బుఁ బిమ్మటన్
వేవపదంబుఁ బొంది కడ తేరఁగవచ్చునటంచుఁ జెప్పుచున్ .


కులగోత్రములఁ గొన్ని కొత్తగాఁ బుట్టించి
విపు లటంచును బేరు పెట్టి
తమ తాత ముత్తాత తండ్రులు వీరికి
గోత్రవురుషులంచు గొణిగి చెప్పి

82