పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము



తమతో సమాసపదవి నిచ్చితిమటంచు
కపటగౌరవ మింత గానుపించి
క్రమముగా భోజన ప్రతిభోజనంబుల
నిప్పించి మర్యాద నేర్పరించి


ద్రావిడులపల్లెలకుఁబోయి తప్పకుండ
బైసి విడనాడి వారితో బాసలాడి
మనకుఁ గింకకులనుజేయుఁ డనుచు దెల్పి
తెలివి తేటలతోఁ బనిదీర్పుఁ డనుచు.


అగస్త్య సంయమీంద్రుండు సమాధానవాక్యంబులు
గార్యగతి నిరూపించి చెప్ప, యుగపల్లబ్ద గౌరవ సంజాత సంరం
భంబున నగస్త్యప్రశిష్యులం గూడి యభినవ బ్రాహ్మణులు
చెల రేగి ప్రవర్తించి కొంత కాలంబుచనుడు ద్రావిడుల పాయ
కట్టులకుం జని-



“గంగ 'గుడులు మాని కట్టుఁమీరు సీ
                      తారాములకు మేలి దద్దళములు
పోతురాజాదుల ముందు చిందులుమాని
                        పట్టుఁడీ భద్రుని పళ్ళెరంబు
“గొంతెమ్మ ” దేవర కొలుపు మాని కొలువుఁ
                       బ్రహ్మ విష్ణు మహేశ్వరులను
మాత “పో లేరమ్మ జాతరలుమాని
                        సలుపు డీ బలులతో జన్న ములను

83