పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము



అన్యు లెవ రేని సేయ యాగడంబు
నేది యిట్టిదికల దె సృష్ట్యాదినుండి !
భాషఁగఱచుటకొక్క స్వత్వంబువ లెనె ?
చదువు జిజ్ఞాసకల్గినఁ జదున రాదొ !


"నీతి శాస్త్రంబులఁ బఠించి నిగ్గుదీసి
మేము చెప్ప మీ రాలింప మేలుకల్గు
జదువ నష్టకష్టంబులు సంభవించు"
ననుచు మాన్పించిర ట్టె విద్యానురక్తి.


ద్రావిడకన్యల నార్యులు
వావీరి చెఱప ధర్మపద్ధతి యయ్యెస్
గేవలఁ మార్యులక న్నెల
ద్రావిడులు వివాహమాడఁ దప్పైపోయెన్.",



సాగుచుండే నేఁడిట్టి యాచారమింకఁ
గేరళమునందు మిగులఁ గేకిసలతోడ
వెక్క సంబుగ సంబూద్రి విప్రు లందు
సనుచితంబన్న వారొక్కరైనలేరు.



ఇచ్చి పుచ్చుకొనుట కల్లెనేని తుల్య
భావ మేర్పడు సు మ్మిరు వాగులందు
ననుచు నీయ మానుచుఁ బుచ్చుకొనుట యొక టె
మహితధర్మ మనిరి నేటి మాధ్వులట్ల,


68