పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


మానవజాతియన్న యభిమాసము లే కసమాన మైన దు
ర్మానము నూని ద్రావిడుల మానము నెల్ల హరించుకోర్కె మై
మానమునందు సుంత యనుమానము లేకవసూనమున్ సదా
మానక హీనమానవ సమానముగాఁ జరియించిరార్యులున్ .


ఎన్ని గతులను వీలౌనో యన్ని గతుల
మతము పేరిట దుస్తంత్ర ముత్రములకు
బ్రధితమూఢులు జేసిరి ద్రావిడులను
వినుము వివరింతు సవియెల్ల విశదముగను.


తిరుమంత్రముఁ జెప్పెదమని
తిరుమంత్రముఁ జెప్పినారు తిన్న గఁ జెవిలో
ధరణీసురులకు మ్రొక్కిన
బరమపదము వచ్చునంచుఁ బరలోకముసన్,


చదువులు నేర్పుచో మిగుల జ్ఞానము కల్గి వివేచనంబునున్
గదురును దాన నయ్యదియె కల్గినఁ దాము వచించు నీతి సం
పద తల కెక్కఁ బోదనుచు బ్రాహ్మణవర్యులు ద్రావిడావళిన్
జగువఁగరాదటంచు మరి శాస్త్రములన్ లిఖయించి లెన్ని యో.


చిఱుతనాఁటనుండియును సంస్కృతముఁ జదివి
సంతఁ దమగుట్టు బయలౌ నటంచు నెంచి
చదువరాద'ని చెప్పిరి సంస్కృతంబు
నదియె పంచాక్షరీమంత్రమయ్యెదుదకు.

67