పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


బానసీం ద్రుగాఁ గొందఱు బానిసీండ్రు
గాగఁ గొందఱ నియమించి కాడుచేసి
కలుషి తాజ్ఞాన గాఢాంధకారమునను
ముంప యత్నముల్' చేసిరి తెంపుతోడ.


కులపతియైస వసిష్టుడు
కులుకుచు శాత్రవులు గోడుఁ గుడుచుటచేతన్
దలపోసి పోసి యీ గతిఁ
బలికెను దనవారితోడ వజ్జరి యగుచున్ ,


చేతఁబడినారు పగవారు చేత దక్కి-
వారి జీవముల్ గొనుకొండ వదలుటోండె
వెట్టిపనియైన మెడకంటఁగట్టుటొండె
మనము నిశ్చయించుట పాపి యనుచుఁ బలుక .


పడుచుమగవాండ్రు ““తమచేతఁ బడిన రిపుల
విడువ ధర్మంబుగాదం”చు నుడువుచుండఁ
దలలు సెజసిన మంత్రవాదు లిటులనిరి
భావి కలగతుల నెల్లఁ బొరఁజూచి:


మన కగ్గమైరంచు మారుర పరికాండ్ర
దల కోసి వైచుచో దారణముగఁ
బగతు రింకను బటాపంచలైపో లేదు
మన పైకి రావచ్చు మాపో రేపో

64