పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయా శ్వాపము


పుట్టి పెరుగుచున్న బొట్టియలకు నెల్ల
నూత్న శౌర్యపటిమ నూరిపోసి
కుబుసమూడ్చినట్టి కోడె త్రాచులఁజేసి
పెంచినారు కులము పెద్ద లెల్ల.


మాంత్రికులు విప్రవరు లప్రమత్తులగుచుఁ
జెడని తంత్రంబుఁ జక్కగా నడుపుచుండ
జుట్టుప్రక్కల పొల మెల్ల జుట్టఁ బెట్టి
కే వశముఁ జేకొనినారు క్షత్రవరులు,


దేశం బీవిధముగ నై
దేశిక వీరభటులకు నధీనమయిన, నా
క్రోశముతోఁ బికించి స్వ
దేశజు లారాటపడుచుఁ దికమక లగుచున్.


ద్రావిడ యోధుల మంతనము




రచ్చమ్రాను క్రింద ద్రావిడమన్నీలు
రెడ్డిగములు వైచి గడ్డు దేరి
రెడ్డిగములఁ బిచ్చి మొడ్డలగంబుండి
మాటలాడి రిట్లు మంతనమున.

57