పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


పాత్రులను బిలిచిబ్రహ్మ
క్షత్రియ వైశ్యులని యాక్యసంఘంబును వ
ర్ణత్రయుముగ విభజించుచు
సూత్రించిరి ధర్మకోటి నూరులదయచే.


నిత్య నైమిత్తిక నియమంబులను దీర్చి
                    భగవంతుఁ బూచింప బ్రాహ్మణులను
ఖడ్గధారలచేతఁ గంపకోటలఁగట్టి
                   కాపాడఁ బల్లెల క్షత్రియులను
వాణిజ్య గోపరిపాలన కృషులచే
                  బండారములనింప వై శ్యపరులు
నియమించి "వేర్వేరు నిర్దిష్ట కార్యముల్
                     జాగరూకతతోడ జరుపుచుండఁ


గూటి యెద్దడి లేకుండఁ గొన్ని నాళ్లు
సకల సౌభాగ్యగరిమచే సొంగ "మూఁడు
పూవు లారు కాయ ”లనిస పోల్కె నెగడెఁ
జూచువారికి నొడలెల్ల సొక్కు పుట్ట.


బ్రాహ్మణుండు వేదపాఠంబు సేయుంగ
క్షత్రియుండు రిఫులఁ జక్కబరప
వైశ్యవుఁడు కృషియు వాణిజ్యమును జేయ
నార్యసమితి 'యేసఁగె ననుదినంబు.

56