పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


చిరి తామర కొలనువలెన్
బరిమితి లేకుండ వారు వర్థిలుచుండన్
సిరిసంపత్తులతోడన్
బెఱవారికిఁ గన్ను గుట్టె బెడిదంబగుచున్.

గండాడు క్రోల్పులుల్ గండరించే చోట
               గోరాడు నేనుఁగుల్ గూడు చోట
బుసకొట్టు నాగముల్ మసకలా డెడి చోట
               గర్జిల్లు సింహముల్ కవియు చోట
ఱంపిల్లి వృషభముల్ జంకె వై చెడి చోట
              మంపిల్లి తోడేళ్లు మరగుచోట
కారుదున్నలుకూ, కసవు మే సెడి చోట
              కారుమబ్బులు తొంగి కలియు చోట

తిండికై వాట్మెకంబులు తిరుగుచోట
వత్సములును బాలురుసు మహోత్సవమునఁ
బందెములు నై చికొని కేళ్ళు వారుచుండ
నూరువర్గాలు తలయెత్తి నొక్కటొకటి.

అంతకంతకు నీరీతి నార్యసమితి
వర్థిలఁ గులము పెద్దలు భావిగతుల
బాయకట్టులఁ జర్చించి బండుకట్టి
గొట్టు దిట్టముల్ చేయుట కర్ణమనుచు.

55