పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


వింటి మే వింతలు! నిజముగఁ
గంటి మే యెపుడేని యిట్టి కార్యమ్ములఁ ? గూ
ర్చుంటిమె చేతులు ముడుచుకు ?
బంటులమని ప్రల్ల దీండు పగెలు కొట్టన్,


బొల్లి మొగముమీఁదను నిలు బొట్టు బెట్టి
రాలుతెప్పల కెల్లను గేలుమోడ్చి
గంద్రగోళంబుఁ గావించు కల్లరీడ
డౌష్ట్యమును మాన్పకుండుట ధర్ము వగునె !


దేశము మనయది కాదో !
దేశోద్ధరణంబు భాగ థేయముకాదో ! !
దేశవినాశకులగు నై
దేశిక హనసంబు మన యదృష్టము కాదో ! !!


అవిసి తేనెలుచిల్కు నమృతకల్పములైన
పండ్ల నిచ్చెడి వృకుపం క్తి గల్లి
తమయంత నే క్షీరధారలు గురియించు
పొదుగులుండిన యాల కదుపుగల్లి

తావుల్ గుబుల్ కొను వూవుదీ వెల 'కప్ప
డంబుల పొదరిండ్ల డంబుగల్గి
తడిసి నాఁ గెటికర్రుదాఁకకుండగ బండు
బలముగ్గన మంచి పొలముగల్లి


58