పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము

నారద సుతర్షి సంవాదము


ఆదె! కంటి వె! మందాకిని
యిదె! త్రిదివక్షోణి వీర లెల్లరు సురల
ల్లదె! నందన వనవాటిక
యిదె స్వర్గమని బలుకఁబడియెఁ బురాణములన్,


పక్ష్మముల్ కురుచలై పనుపడఁ బరులకు
               గనుజెప్పలార్చుట గాన రామి
ఇవముచే రేఁ బవ లివతళించుట చేత
               జెమట చిత్తడి దరిఁ జేరగామి
కూటి యెద్దడి మాన్పుకొఱకుని పడుపాట్లు
             ముసలితనంబును మూలద్రోయ
దృఢగాత్రులగుటచే మృతినొందునందాక
            వార్ధక్యపదవి చేపడమిచేత
సనిమిషులనంగ స స్వేదులనఁగ నిర్జ
             రు లనఁగఁ ద్రిదశులన యోగరూఢి కెక్కి
స్వర్గలో కౌకులు పురాణచయమునందు
             వాసి కెక్కిరి సర్వప్రపంచములను,


ఇంతియె కాక త్రివిష్టపశబ్దా ముంబట్టి యింద్రుఁడు
ముజ్జగంబుల దొరయని ప్రసిద్ధి వడ సెగాని బాహుబలంబుచే
లోకత్రయంబును జయించి కాదు...


46