పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


నేను దిగులుపడి, నాకంబు విటవిటీ భోగ్యంబుకాని, మౌనిజన
నాసయోగ్యంబు కాదని యెంచి వైళమ భరతఖండంబునకు
రాఁ బ్రయాణోన్ముఖుండ సగుటయు.--


భస్మలి ప్తంబైన బడుగు దేహపు కాంతి
                మంచుకొండలమంచు పంచుమించ
మధుర వీణాగాన మహిమంబు గంధర్వ
               యువతీజనంబును నుదుటపజప
ద్రుతతరం బై సట్టి గతి చాకచక్యంబు
              కాయసిద్ధిని జూటఁ గల్గుచుండ
సంస్కృత వైయాఘ్ర చర్మసం త్యాగంబు
              నిస్సంగతత్వంబు నెజపుచుండ


త్రిభువనవిహారీ నారద దేవమౌని
సంగరహితుండు. శుద్ధాంతరంగమూర్తి
మోము పై మందహాసంబు మోసులెత్త
దత్క్షణంబ నా మొలఁ బ్రత్యక్షమయ్యె,


వయోవృద్ధుండును, గుణ ప్రవృద్ధుండును, బ్రబుద్ధుం
డును, సంకల్ప సిద్ధుండును, అనుకంపాబద్ధుండును సగు వీణా
వాదన విశారదుం డగు నారదునకు నమస్కారముఁ జేసి, నా
వచ్చిన కార్యంబు విన్పింప, నారదుం డర్ధనిమీలి తాకుండై
యిట్లనియె

45