పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


అనవిని నేనిటు వాగొని
తిని : నారదమౌని ! భారతీయులకును స్వ
ర్గ నివాసులకును నేస్తం
బును జుట్టఱికమును రాకపోకలు గలవే !


ఓ త్రికాలజ్ఞ ! ధర్మసంయు క్త చరిత ! !
అరసి వచియుంపుఁడి, సురశబ్దార్థమేమొ !
ఎటుల సురలైరో నాకౌకు లెల్లఁ దొల్లి ! !
యాతుధాను లెట్లైరొ సురారు లెల్ల ! ! !


అసుములనెడి నామంబెటు
లసురవిరోధిచయమునకు లభియించెను దా
పసవర ! పుణ్యజనులు రా
క్షసులన నుతి కెక్కి రేమికతమునఁ జెపుఁడీ.


అంత దేవర్షి చంద్రుఁడయిన నారదుండు తెలివి వారిన మోముతో
నన్నుఁదిలకించి సాభిప్రాయంబగు మందహాసంబుఁ జేసి యిట్లనియె.


బహుళ నృశంసుఁడై పరమ పాపపరుండయి పాక వైరి దు
స్సహమగు బ్రహ్మహత్య నేటి సల్పి పదచ్యుతుఁడైన దేవతల్
“సహిసహీ దేవలోకమున నాయకుఁడౌటకు నర్హు డంచొగిస్
సహుషుని దోడి తెచ్చి సురనాథుని జేయుట నీ వేఱుంగ వే.


47