పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వా న ము


గురుతర హిమవద్ధరణీ
ధరపరిసరము త్తరించి తత్పరమతి'తో
మరుభూములఁ గని మరలిచి
సురకరువలి చుట్టుముట్టి సుడిముడి పెట్టన్ . ,


మంచుగప్పిన మరుభూమి మండలంబు
మీఁదఁ బడి యేటవాలుగా మిహిరకిరణ
పాళి కన్ను చెదరునట్టు ప్రతిఫలించి
యినుమడించి వింవీథికి నెగయుచుండె.



అరుదగు గుట్టమిట్టలను సన్నిటిఁ జూచుచుఁ బోయి పోయి యు
త్తరకురుభూములం గడచి దవ్వులనున్నత్రివిష్టపంబు సం
బరపడి సూచి యాపొలము పచ్చికబీళ్ళను దోఁట దొడ్లకున్
వరుసగగాంచి యట్టె నిలువంబడిపోతి బ్రమాకులుండనై


విపుల సరోవరంబోక (డు వీక్షణమాలిక కడ్డురాఁగ నే
నపుడు తలంచినాఁడ నీదియౌగదమానసమందు భంగముల్
తపతపముంచుఁ గూలములఁ నాకుచుఁ బై బడుచుండ నింతలో
రెప రెపమంచు లేచిచనే రివ్వున మింటికీ రాజహంసలున్.



బంగరు పూతబూసిన విభాతిని దోచెడి తమ్మితూండ్లతో
దొంగలి రేకులం దెగడి దూకొని వచ్చెడి కమ్మ తావులున్
రంగరు వన్నె చిన్నె గల రంగువులుంగుల నంగికూయి యు
ప్పొంగఁగఁ జేసె సన్నుఁ బరిపూర్ణరసానుభవంబుఁగూర్చుచున్ .


21