పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము


ఏమియు దూరభారమని యెంచక నేను దీవిష్టపంబుఁ గ
న్గొమదిఁ బట్టుపటిక యిదిగో! యదిగో!! యని పోయి పోయి బి
డ్డా! మిహిరుండు కన్పడనియట్టి పొలంబుల దాటిపోయి ధర యా
నుడ లుత్తరించి మరి యామడ లెన్నియొ యేగి నిల్వఁగా,


దూదిపింజలరీతి దులదుల పడసాగె
బై నుండి హైమంబు పట్టపగలె
పూగుత్తులను భ్రాంతి పుట్టగా మిక్కీలి
కసిదీర వడిగండ్లు విసరికొట్టె '


మిట్టమధ్యాహ్నం బే మిథునముల్ చెలరేగి.
చెట్టచెట్టుల చుట్టు చేర సాగే
కను రెప్పపాటులో గలిసిన మిథునమ్ము
లప్పుడే 'తారుమా రగుచునుండె



చేతులును గాళ్లు క్రొవ్వలి చేతనపుడు '
కొంకరలు పోవజొచ్చెనుగొలది కొలది
వింత దేశంబు దీనిలో వేగుటెట్టు
లనుచు నాందోళిత స్వాంతుఁడైతి నేను.

పొజు సెల యేళ్ళ నీటితుంపరలతోడ
విరుల కొందావీ విరజిమ్ము తరులనీడ
సురల యాచారముల నెల్లఁ జూడగోరి
యెదురుచూచుచు నిలుచున్న యింతలోన


32