పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాసము


కడచెనో! లేదో! వత్సర 'మొకండు స్వయంకృషి చేసి దీక్షతో
ముడుఁగక తెల్గుబాస గడముట్ట గ్రహించెను గుట్టుమట్టులున్
బడ సె యశంబు పేర్పడిన పండితకోటియు మాగువారగా
బుడులనుగూర్చితండ్రి మదిఁబొందుచునుండఁగ మోద ఖేదముల్



ఈడ్యతరప్రనమున నెన్ని గ్రహించిన నేమి ? ధర్మువున్
బిడ్వ ము లేక యే తలఁగఁ బెట్టినదాని ఫలంబుగా మనో .
జాడ్యము మోసు లెత్తె నిఁక శాస్త్రి, విడాకుల నిచ్చే బుద్ధికిన్
బాడ్యమిగానరాని నెల బాలుడు' గన్పడికు న్నె యావలన్ ?


సొబగునీరూపముగాజువార మొగమున్సొంపార పై వర్ణ్యమున్
నిబిడంబై యెసలార, సర్వసుకులా నిష్ణాతుఁ డైనట్టి బా
డబుస్వాస్థ్యం బుబలాట మై తిబిరియై డక్కై – సదా రిమ్మయై
గుబులై గింగిరులై చనెస్ జివరకున్ గోరాడు 'పెన్వేర్రియై,


కొమరుప్రాయంపుఁ బేమంపుఁ గొడుకుకుర్ర
కుర్రఞ తనముందే యిటులౌటకుం జలించి
క్రమ్ము కన్నీరు బొటబొట కారుచుండ
దిగులు పడుచు శుష్కించెను దేవశర్మ


ధర్మవ్యతికరణమ్మున
నిర్మలమతియైన శాస్త్రీ, నెంజిలిచేతన్
దుర్మరణంబం దెను బ్రా
క్కర్మముఁ దప్పింప నెవరు కర్తలు ధరలో ?


121