పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణ ము


"పెద్దల మాటలన్ వినినఁ బెద్దరికంబిదే వచ్చుఁ బుత్రకా !
వద్దు పఠింపఁగాఁ దెలుఁగుబాస నటంచును దండ్రి చెప్పఁగా
నద్దములోని నీడకు భయపడువాఁడనె ! యంచు మొండియై
గ్రద్దరియై పోకాలెను గకావికలై జనకుండు కుందఁగన్.



పండితుఁడైన బ్రాహ్మణుఁడు పాదలితోపను బోనీవాఁడు ధీ
మండలి మండనుండు మను మార్గము దప్పిన కారణంబునన్
గొండొక కాలమున్ నరక కూపము నందు వసించి "శేషమున్
వెండియు భూమిపై 'ననుభవింపఁగ జన్మ పరంపరాహతిన్,



రంగశాయికి విందు. శ్రీరంగమందు
జన్మమెత్తెను నొక్క యాసామి యింట
గంగికుర్రకి వత్సమై కడకు శాస్త్రి
ప్రాగ్భవ వి శేష పుణ్య సంపాదనమున


తల్లి చనుబాలు నోకపూటఁ ద్రావి గడ్డి
పోఁచ యొకఁడైన ముట్టక పొక్కిపొక్కి
పొదుగు, దుఃఖంబుచేఁ దల్లి పొదుఁగు మాని
తుదకు నుసురునురనుచును దొరఁగె నుసురు.


తోరఁగిన వెంటనే రియొడలు దొడ్డ గుణంబుల పట్టుగొమ్మయై సురుచిర రూపసంపదల శోభిలి శుభ్రగుణాలవాలుఁడై గురుతర రామభక్తీ పరిగుంభిత చిత్త సరోజుఁడై గుణో త్తరుఁడయి దేశి కేంద్రుఁడయి తాబ్రభవించెఁగబీరునాముఁడై


122