పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు

స్వామీ ! నీవు ముట్టుకోగూడదు " అని ఆ పొట్లాం 'తానే తీసుకొన్నాడు. రామస్వామిగారికి పెద్ద ప్రశ్న గలిగింది - "నే డబ్బిచ్చాను. నేనెందుకు ముట్టుకోగూడదు ?”

తరువాత బందరులో చదువు, నాలుగోఫారం నుంచీ కవితావ్యాసంగం. బందరులో యెక్కువగా కృషి. ఒక ప్రక్క కవిత్వం-మరొకపక్క స్పోర్ట్స్ ఫుట్ బాల్ అద్భు తంగా ఆడేవారు. టీముకు కెప్టెన్. ప్రిన్సిపాల్ తో పోట్లాడి, ఈ సంవత్సరం నీ కా లేజీజీకి కప్పు రాకుండా చేస్తాను..' అని చెప్పి మరొకస్కూల్లో చేరి, ఆ స్కూలుతరఫున టీముకు కెప్టెన్ గా వచ్చి కప్పు గెలుచుకు వెళ్ళారు.


కవిత్వం. . .అవధానాలు. కవిత్వ విషయంలోనూ, సంస్కృతాధ్యయనంలోనూ అష్టకష్టాలు-యొక్క-డకు వెళ్ళినా వొకటే మాట.నీవు శూద్రుడవు.” ఆసూరి కాంతయ్య సూరిగారి (జిల్లారెజిస్ట్రారు) వద్ద కావ్వ్యపఠనం. చివరకు వేంకట శాస్త్రిగారి శిష్యత్వం. స్కూల్లోనే కాకుండా వారింటికి వెళ్ళీ చదువు– వెంకటశాస్త్రిగారి వాత్సల్యం.

రామస్వామిగారి ఆనాటి కవిత్వానికి వొక నిదర్శనం_


ఒక బ్రాహ్మణవిద్యార్థి రామస్వామిగారి పద్యాలు తన గురువు దగ్గరకు తీసుకు వెళ్ళి ఎనరువ్రాసిందీ చెప్పకుండా, “ఈ పద్యాలు దిద్ది పెట్టండీ,” అన్నాడు. ఆయన పద్యాలు చూచి, వొకపదాన్ని చూపుతూ, “ఈ పదం తీసివేసి మరొక

10