పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


పదం చేస్తే బాగుంటుంది” అన్నాడు. “ఈ పద్యాలు రామస్వామి వాసినవి అన్నాడు విద్యార్ధి, “అయి తే ఏది, మళ్ళీ వొక సారి చూడనివ్వు.” అన్నాడు గురువు.


చౌటపల్లి లో స్వయంవ్యక్తులను తయారుచేసే సంఘ స్థాపన, అన్ని వృత్తులూ తామే (ఈ సంఘమే) చేయాలనీ దీని ఆదర్శం. ఐర్లాండ్ నుండి వాసిన ఉత్తరాలనుబట్టి, ఆ గ్రామం లో పురాణాలకు వ్యతిరేకంగా, దేవుడు లేడనీ, దయ్యాలు లేవనీ, అగ్రజాతికి ప్రత్యేక హక్కులుండగూడదనీ ప్రచా రం చేసినట్లు తెలుస్తూవున్నది. ఈ ప్రచారంవల్ల వాగ్వా దాలూ, దూషణతిరస్కారాలూ జరిగినట్లుకూడా తెలుస్తూ వున్నది. రామయ్యగారికి వుత్తరంవ్రాస్తూ, “ఉన్న సంగతులు నీకు విశదంగా వ్రాశాను. మిరే ఆలోచించుకొని వొక నిర్ల యానికి రండి ! నేను చెప్పానుగదా అనిమాత్రం చేయ బోకండి !” అనివ్రాశారు.


ఒక చిన్న సంఘటన


రామస్వామిగారు వొకనాడు మొహంవుల్లలకోసం చెట్టు యొక్కబోతూవుండగా, ఆ చెట్టుకి ఇనుపమకులూ, మేకులకు జుట్టూ చుట్టివుంది. కిందికి చూచేప్పటికి డబ్బులూ, నిమ్మకాయలు", వేప బెత్తమూ (చేతబడిసంబంధం) పడివున్నయి. కొంచెం తటపటాయించారు. చెట్టెక్కి పుల్ల కోసుకొని, నెమ్మదిగా చెట్టుదిగివొచ్చి, డబ్బులు జేబులో


11