పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరామస్వామి గారు


అగ్రజాతి నిరంకుశత్వం; మిగతా జాతుల మౌఢ్యం , అజ్ఞానం, బానిసత్వం_అవి ఆవి రోజులు


అప్పుడూ రామస్వామిగారి జననం. చిన్న తనం అంగ లూరులో. కోణంగి తనానికీ, కొంటెతనానికీ పసిద్ధి, ఇప్పటికీ కట్టుకథలుగా చెప్పుకుంటూ వుంటారు... “అమ్మ కడగొట్టు బిడ్డ.

గుడివాడలో చదువు.

ఇంత చిన్న తనంలోనే వొక సంఘటన


రామస్వామిగారికొక బ్రాహ్మణ స్నేహితుడుండేవాడు. ఒకనాడు యిద్దరూ మిఠాయి దుకాణం దగ్గరకు వెళ్ళారు. 'రామస్వామిగారు మిఠాయి కొంటూ వుండగా భాహ్మణ స్నేహితుడు నాక్కూడా కొనిపెట్టవలసిందని అడిగాడు. దానిక్కూడా రామస్వామిగా రే డబ్బిచ్చారు. తన పొట్లాం జేబులో పెట్టుకొని "రామ స్వామిగారు రెండో పొట్లాం అందు కోబోయేసరికి బ్రాహ్మణ స్నేహితుడు వారించాడు. “రామ

9