పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము

కావున సందియంపడి కారణమేదియు గల్లదై న మీ
భావము సమ్మకున్న యెడ వ్యాసుఁడు "వేదవిభాగకర్త యే
యీవల కేగుదెంచి మన యెల్లర ముం దీదమిత్థమంచు సౌ
ఖ్యావహమంచు ధర్మగతి యంచు వచించుఁ దలంగనేటికిన్?



బాదరాయణుఁ డొక్కడే వేదవేత్త
యర్హుడతఁ డొక్కడీ సంశయంబుఁ దీర్ప
బరులు రవ్వంత చాల రీపని కటంచు .
సరవిఁ గన్గవ యరమోడ్చి సంస్మరింప


శీతవాతాతప జాత బాధలు లేని
మొరుగు బొడలు మీరు మిట్లు గోల్ప
మొలచుట్టి రాఁజుట్టి మెలి పెట్టి దోఁపిన
డం బైన కృష్ణాజినంబు మెజయ
భాగీరథీ దివ్య వారి ప్రపూర్ణ క
మండు లెడమ ప్రక్క" మక్కళింప
యోగ దీక్షావేళ నుపయోగపడెడి త్రి
దండంబు కుడిచేతఁ ద్ర స్తరింప


పర్వ తేంద్రుని దెసనుండి వచ్చు ధాటి
జడలు గట్టిన వెండ్రుకల్ కడలం బాఱ
వ్యాసభగవానుఁ డింతలో వాయు గతిని
నుట్టిపడ్డట్టులయ్యే మా క ట్టెదుటను,



100