పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప థ మా శ్వాసము


ఎక్కడ హీమవత్పర్వత
మెక్కడ నై మిశము గడియ యేగక మున్నే
చెక్కు చెమర్పదహో ! యా
చక్కికి నే తెంచి సిద్ధ సంకల్పుఁ డగున్ ,


బ్రహ్మ తేజంబు వదనబింబంబు నందు
నృత్యమాడుచు జగము మోహింపఁ జేయ
సంయములు లేచి కడు సంతసంబుతో “స
మోనమ" యటంచుఁ బల్కఁగ మోడ్పు కేల


మమ్ముల నట్టెచూచి యభిమానము రాగము త్రుళ్ళుచుండగా
ముమ్మరమైన వత్సలత మో మెసలారఁగఁ గూరుచుండుఁడీ .
యుచలికముఁ బొందకుఁడి యోగిని వెలయంచుమాదు క్షే
మమ్ము నెరింగి సంతసిలి మన్న నతో నిటుపలెఁ బిమ్మటన్,


శౌనకా ! నీవు మమ్మెద సంస్మరించి
నంత నే బుద్దీగోచర మయ్యో మాకు
సర్వవృత్తంబు; నీదు సంశయముఁ దీర్ప
ఋజు పథమ్మని దుర్వాసుఁ డెలమి జెందు.


ఆలింపుము నా సూక్తులు
దూలింపుము తప్పకుండ దుష్కృత్యములన్
పాలింపుము ధర్మంబుల
గాలించియెరుంగు శౌనకా కర్జనములన్.


101