పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాసము

మనముందు నేగిన ముసి ముముకువు లెందు
ఈ నేతి నేతి” యని యూహించినారు
'వేద వేదాంగము లాదినారాయణం
డే భాషలోఁ జెప్పి ఋషుల కిచ్చె


ఇట్టి సంపూజ్యభాషయం దెట్టు సాహా
సింపఁగలఁడు ? సూతుఁ డుపన్యసింపఁ దనకు
లేశమగు నధికారంబు లేదటంచు
నెఱిఁగియుండియు శౌనకా ! యరుగఁబల్కు.


ఈ సూక్తి సమాకర్ణనంబునఁ గొందఱు వాచంయములు విషాదచిత్తులై దిక్కులుచూడఁ దొడంగిరి. మరి కొందఱు పుల్లవడినమోములతో నావంక జూడ్కులు ప్రసరింపఁ జేసిరి. ఇంకఁ గొందరు విహ్వలస్వాంతులై , యేమీ చెప్పుటకుఁ దోఁచక యెవ్వ రేమి చెప్పదురో యని వేచియుండిరి. అంత శౌనకుండు పిడుగడచినట్లై, కొంతవడికిఁ దెప్పిరిలి సదస్యుల యస్య బింబ ముల దృష్టి నిబద్ధముం జేసి రాల్పడు నీ రెలుంగుతో -----


వేదవ్యాసఋషీంద్రుఁ డెన్న డు చతుర్వేదోక్త ధర్మంబులున్
వేదాంగంబులు సంస్కృతంబున సదా విన్పించే సూతర్షి కిన్
వాదం బేటికి శ్రీ నాఁడె యద్విజులు నేర్వన్ నేర్ప గీర్వాణ భా
షాదోషజ్ఞతఁ బొంద నర్హు లయి రీ సందేహ మిం కేటికిన్ ?


99