పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ తపు రా ణ ము


చదివినవాఁడు శాస్త్రములు సర్వము, బెలయందు భక్తిచే
మెదలినవాఁడు నెల్లపు డ మేయగుణాడ్యుఁడు శీలవృత్తముల్
పొదలినవాఁడు ప్రల్లదనమున్ మెఱమెచ్చులు లేనివాఁడు, మె
ప్పొదవినవాఁడితండొకరుఁ డొప్పును సత్కథకుండు నౌటకున్

అను నీ శౌనక వాక్యము లాలించి నైసర్గిక నిష్క-పట వాక్పారుష్యంబున దుర్వాసుండుపాలంభ సంబుగా నిట్లనియె--

సభికులో! వేద వేత్తలు ద్విజన్ములు, భౌషయొ! సంస్కృతం బనే
కభవహరాడ్య నైమిశము కాగలక్షేత్రము, కాలమన్న నో
శుభతరసత్రయాగ మెటు సూతుఁడు నిర్మలధర్మవై దుషీ
విభవముగల్గియున్నను, వివేకము కల్గిన సర్హుడయ్యెడున్ !


ద్విజుల సేవించి కఱదలు తెలియవచ్చు
ద్విజులఁ బూజించి స్వర్గమే తేరవచ్చు:
గాని యద్విజుల్ ద్విజులకేం దేని ధర్మ
మర్మము లుపదేశింప సంభవ్య మగునె ?


సృష్టిలోఁ దొలుదొల్త నేభాష భగవతి
వాణికి జిలిబిలి పల్కులయ్యే
ఆజాబాలగోపాల మమరు లేభాషలో
దేవాది దేవు స్తుతించుచుంద్రు


98