పుట:Snehageetalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
ఎవని గంజిత్రావి ఈ బ్రతుకీడేరు
అతని యునికినైన నరయబోరు
మార్గము గనలేక మహిని బ్రతకలేక
వేషధారులైరి విధికి జడిసి 499

యతులు వెదకినారు సతులు వెదకినారు
కానలేరు వెదుక మానబోరు
జాడ వెదకుటందు జడధారులైననూ
ఓడిపోయి పట్టువీడిపోరు. 500

ఒకటి పొందగోర సకలమ్ము నీదౌను
అన్ని కోరుకున్న అందదేది
మూలమరసి పూని కొలువగ లభియించు
నతనిపొందు, సత్యమరసిచూడు 501

ప్రియుడు పిలుచుచుండె ప్రేమగా రమ్మని
నాకు చేరగలుగు తేకువేది
దోలమనికి1 తోడ దుర్వాసు2 చేరంగ
బుద్ధిపొసగబోదు శుద్ధిలేక 502

ప్రేమగలుగువాని స్వామి చోపట్టును
కపటకాపదులును కట్టియుండు
సత్యశబ్దమందు సారమ్ము గ్రహియించు
పలువమాటవలన పలతమేమి. 503

మనసు స్వామిదరిని మాధుర్యమైపండ
అంతరమ్మురాదు సుంతయేని
కరగిపోవ మంచు కడవలోనీరౌను
హరియు హరిజనుండు అన్యమగునె 504

గళమువిప్పి నేను గాంధర్వగతిలోన
పారవశ్యమంది పాడిగాను
ఇట్టిబలము నాకు నిచ్చువాడెవ్వడు
శౌరి అండనున్న శక్తికేమి? 505

అన్ని వృత్తులందు అతిమేలు తిరిపమ్ము
దానినడ్డువాడు ధరణిలేడు
రకరకమ్ములయిన రసనమ్ము లభియించు
పొరుగులేని పెద్ద భోగమదియె 506

నాదలోలుడైన నాస్వామి తెలియగా
విషదమైన భవము విడిచినాడ
మనసు కట్టివేసి మాధవు జపియించి
కడకు సఫలమైన కాంతినైతి 507

నామరత్నమనెడి క్షేమమౌ ధనముండె
అదియె నిత్యసత్యమనియు తెలిసె
దానమిత్తనంచు దాపుగానేనుంటి
అడుగు వాడలేడు అవని మీద 508
<poem>