పుట:Snehageetalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
వాకిచదరిపారు వాహినింగనలేక
దప్పిదప్పి యనెడి తప్తమేల? 484

మొదలు నరకివేయ మోసులెత్తును వల్లి
చిగురుటాకు వేసి చేతమగును
నీళ్ళుబోసి పెంచ నిలివున వడబారు
అకట ! దైవలీలలర్థమగునె ? 485

హంస కులములోన నానందమునబుట్టి
హంసస్పర్శ పరమహంసనైతి
ఎద్దునాపగలుగు బద్దనే ధరియించి
నీదుమ్రోల రామ నిలిచియుంటి 486

గుణము నెఱుగువాడు గుణమునే గ్రహియించు
ఎరుగనట్టివాడు యేవగించు
జాజిఫలము రుచులు జాతోక్ష మెఱగదు
గందమెరుగబోదు గడ్డి తినును 487

మంచిక్షేత్రమరసి మంచి విత్తులునాటి
సేద్యమెంతొ బాగ జేసివాడ
మొలక మొలవలేదు మోసమెవ్వరు చేసె
గుర్తు తెలియుమోయి కర్త ఎవరొ ? 488

చేత జంత్రముండి చైతన్య శ్రుతులీన
మనసు దివ్యలోక మనకియయ్యె !
తెలియదోయి తీగ తెగిపోవునని సుంత
ఎవరి దోషమంచు నెపుగగలవు 489

చెప్పిచెప్పి పరులచేతలన్ సరిచేసి
నీదునోట దుమ్ము నింపుకొంటి
పరులకుప్పగాయ ఫలితమేమగునోయి
కొల్లబోయె నీదు యిల్లుచూడు 490

గురుని చూపునెవరు? గురి చూచునెవ్వరు?
లక్ష్యసిద్ధి ఎవరు? లక్ష్యమెవరు?
అమ్ములన్నిపోయె అసలుచిక్కకపోయె
అందులోని మర్మమరయగలవె? 491

ఎందరేగినారి ఎందరొచ్చిరిలకు
‘భావ’ ‘ రూప’ సామ్య బంధువెవరు?
తనదినాకు జెప్పి తనునాది వినునట్టి
తపసి దొరకలేదు ధరణియందు 492

దేశ దేశమందు తిరిగిచూచితి నేను
ఊరువాడలంట పోరినాను
విభుని తెలియనట్టి వివరమ్ము గలవాడు
కానుపించలేదు కలికమునకు1. 493

అందమున్నదనుచు నానందపడనేమి !
ప్రజ్ఞ గలిగినంత ఫలితమేమి?
మనసు మంచిదైన మవ్వమున్1 జ్ఞానమున్
పరిమళించు, పూన్కి ప్రతిఫలించు 494

గగనమంటె చెట్టు గంపెడున్నమి పండ్లు
ఫలమున చవి చెప్పనలవికాదు
చేతకందనపుడు చేయగల్గినదేమి?
పండిరాలిపోవ ఫలతమేమి? 495

స్పర్శవలననేది బంగారమైనదో
దాన్ని ఇనుముసేయ తరముగాదు
గంధసిరులు కింశుకావిటపిని2 చేర
దాన్ని మోదుగనుట తగవుగాదు 496

ఎముక సొమ్ముగాదు ఎఱచి3 తినగరాదు
తోలుతోలెగాని డోలుగాదు
మానవుండ నీదు మనసొక్కటే గొప్ప
ఎడద కలుషపరచి యేడ్వనేల ! 497

సంశయమ్ము ద్రుంచి సహన శోభను పెంచి
పరవశమ్ము నింపి పాడుకొనుము
రాగసంకటములు భోగపీడనతెగి
రామసన్నిధాన ధామమబ్బు. 498
<poem>